

థాయిలాండ్‌లోని పుకెట్ నుంచి వస్తున్న ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ ఏ320 విమానం గత నెలలో గగనతలంలో ఒక్కసారిగా 300 అడుగులు కిందకు జారిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విమానం నడిపిన పైలట్ మత్తు పదార్థాలు తీసుకున్నట్లు పరీక్షల్లో నిర్ధారణ కావడంతో అతడిని తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు ఎయిర్ ఇండియా శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించింది. ఈ వ్యవహారం చాలా తీవ్రమైనదని పేర్కొంది.
మరోవైపు, విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ ఏఏఐబీ శుక్రవారం డీజీసీఏకు సమర్పించిన ప్రాథమిక నివేదికలో కీలక అంశాలను వెల్లడించింది. విమానం ఒక్కసారిగా కిందకు జారడానికి ముందు దానిలోని మూడు ప్రధాన హైడ్రాలిక్ వ్యవస్థలు ఒకేసారి పనిచేయడం ఆగిపోయినట్లు తెలిపింది. అయితే ప్రీ-ఫ్లైట్ తనిఖీల సమయంలో ఎలాంటి లోపాలు గుర్తించలేదని పేర్కొంది. నివేదిక సమర్పించిన కొన్ని గంటల్లోనే పైలట్‌పై ఎయిర్ ఇండియా చర్యలు తీసుకోవడం గమనార్హం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!