
జనరల్

కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ జీవిత చరిత్ర ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం నవంబర్ 10న ప్రచురితం కానుంది. ప్రముఖ ప్రచురణ సంస్థ హార్పర్‌కాలిన్స్ ఇండియా ఈ విషయాన్ని వెల్లడించింది. విడుదలకు ముందే ఈ పుస్తకం ప్రచురణ వ్యవహారం కారణంగా వార్తల్లో నిలిచింది.
ఈ పుస్తకాన్ని తొలుత పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా ప్రచురించాల్సి ఉండగా, సంస్థకు, సోనియాగాంధీ ప్రతినిధులకు మధ్య వివాదం నెలకొన్నట్లు సమాచారం. దీంతో భారత్‌లో ఈ పుస్తకాన్ని తాము ప్రచురించడం లేదని పెంగ్విన్ ప్రకటించింది. తాజాగా హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురణ బాధ్యతలు చేపట్టి నవంబర్ 10న పుస్తకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!