

జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ సంస్థలో ఫిన్‌లాండ్, జర్మనీ దేశాల్లో పర్యటించి వచ్చిన ఉపాధ్యాయుల బృందంతో నిర్వహించిన ‘టీచర్ ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ విజిట్ అండ్ ఎడ్యుకేషనల్ ఎక్స్‌చేంజ్’ ఇంటరాక్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన విద్యా వ్యవస్థను నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు, ఉన్నతాధికారులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సంస్కరణలు అమలు చేస్తున్నామని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ప్రతి విద్యార్థిని ప్రపంచ స్థాయి పోటీకి సిద్ధం చేసేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాలని, ఉపాధ్యాయులు తమ అనుభవంతో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే విద్యా సంవత్సరానికి అవసరమైన మార్పులపై డిసెంబర్‌లోగా నివేదిక సమర్పించాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!