

హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన అభివృద్ధి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ ను తెలంగాణ అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ తదితరులను స్వాగతించిన సీఎం, ఈ కార్యక్రమం రాజకీయ సభ కాదు, అభివృద్ధి ఉత్సవమని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో తెలంగాణ భాగస్వామ్యంగా ముందుకు సాగుతోందని చెప్పారు.
మూసీ నది అభివృద్ధి, మెట్రో రైలు విస్తరణ, రేడియల్ రోడ్లు, హైదరాబాద్–మచిలీపట్నం 12 లేన్ల రహదారి వంటి కీలక ప్రాజెక్టులకు కేంద్రం తక్షణ ఆమోదాలు ఇవ్వాలని సీఎం కోరారు. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాల అభివృద్ధి ప్రాజెక్టులకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు ప్రధాని కార్యాలయంలో ప్రత్యేక సింగిల్ విండో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!