
జనరల్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్‌పై నమోదైన కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని రాష్ట్ర డీజీపీ సీవీఆనంద్ ను ఆదేశించారు. బండి భగీరథ్ కేంద్ర మంత్రి బండిసంజయ్ కుమారుడు. ఈ నెల 8న ఫిర్యాదు అందినా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ముఖ్యమంత్రి డీజీపీని ప్రశ్నించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారని డీజీపీ తెలిపారు. కేసును సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!