
టెక్నాలజీ

అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రంలో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ సోనల్ చౌదరి తన కుమార్తె బానికి ప్రైవేట్ ప్రీస్కూల్‌లో అడ్మిషన్ కోసం వెళ్లిన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అక్కడి విద్యా విధానం, ఉపాధ్యాయులు–విద్యార్థుల నిష్పత్తి, పిల్లలకు అందించే సౌకర్యాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఎనిమిది మంది పిల్లలకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటం ప్రత్యేకతగా నిలిచింది.
పిల్లలకు పాటలు, యోగా, సృజనాత్మక ఆటలు, ప్రారంభ అభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారానికి రెండు రోజుల ప్రోగ్రామ్‌కు ఏడాదికి సుమారు ₹4 లక్షలు, ఐదు రోజుల ప్రోగ్రామ్‌కు దాదాపు ₹9 లక్షల ఫీజు వసూలు చేస్తున్నారు. ఇది భారతదేశంలో కొత్త మారుతి బ్రెజ్జా ధరతో సమానమని ఆమె తెలిపారు. ఈ వీడియో అమెరికాలో ప్రారంభ విద్య ఖర్చులపై విస్తృత చర్చకు దారితీసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!