
క్రీడలు

కొడంగల్లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఆలయ పునర్నిర్మాణంతో పాటు ప్రాంత అభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
అదేవిధంగా 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వరస్వామి ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!