
జనరల్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం పోలవరం సహా రాష్ట్రంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయి ప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొని ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.
నీటి నిర్వహణలో సాగునీటి సంఘాలతో పాటు ప్రజలను కూడా భాగస్వాములను చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయాభివృద్ధికి, నీటి వనరుల సంరక్షణకు ఇరిగేషన్ వ్యవస్థ బలోపేతం కావాల్సిన అవసరాన్ని చంద్రబాబు ప్రస్తావించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!