

రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో ధాన్యం సేకరణపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. ధాన్యం లోడింగ్‌లో ఎలాంటి జాప్యం జరగకుండా స్థానికంగా అందుబాటులో ఉన్న హామీలను గుర్తించి వినియోగించుకోవాలని సూచించారు. ధాన్యం లోడ్ చేసిన వెంటనే రైతులకు రశీదులు అందేలా చర్యలు తీసుకోవాలని, తద్వారా తాలు, తరుగు పేరుతో అక్రమాలు జరగకుండా చూడవచ్చని పేర్కొన్నారు.
లారీల కొరత ఉన్న ప్రాంతాల్లో ట్రాక్టర్లు, ఇతర వాహనాలను వినియోగించాలని అధికారులకు సూచించారు. అకాల వర్షాల సమయంలో ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాతావరణ శాఖ హెచ్చరికల ఆధారంగా రైతులను అప్రమత్తం చేసేందుకు మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించాలని చెప్పారు. ప్రతి IKP సెంటర్, రైస్ మిల్లుకు బాధ్యతాయుత అధికారులను నియమించి పర్యవేక్షణ చేపట్టాలని, మిషన్ మోడ్‌లో పనిచేస్తేనే సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయని సీఎం స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!