
రాజకీయాలు

తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ గేయరచయిత, ఆస్కార్ విజేత చంద్రబోస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సోదరుడు రాజేంద్ర (కనుకుంట్ల రాజేంద్రప్రసాద్) ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
వృత్తిరీత్యా బెంగళూరులో స్థిరపడిన రాజేంద్ర వ్యాపార పనుల నిమిత్తం అన్నమయ్య జిల్లాలోని కలికిరికి వెళ్లారు. స్వల్ప అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం బయటకు వచ్చిన ఆయన, హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!