
బిజినెస్

అమెరికాలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ నిబంధనలను మార్చే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో అడుగు వేశారు. అమెరికాను శత్రుదేశాలుగా భావించే దేశాలకు చెందిన తల్లిదండ్రులకు అక్కడ జన్మించిన పిల్లలకు ఆటోమేటిక్‌గా లభించే పౌరసత్వాన్ని పరిమితం చేసేలా కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసినట్లు సమాచారం. అమెరికా గడ్డపై జన్మించిన వారికి సాధారణంగా పౌరసత్వం లభించే విధానంలో మార్పులు తీసుకురావడమే ఈ చర్య లక్ష్యంగా కనిపిస్తోంది.
బర్త్ టూరిజానికి సంబంధించిన అంశంపై అమెరికా సుప్రీంకోర్టు ఇటీవల 6-3 మెజారిటీతో తీర్పు ఇచ్చిన కొద్ది వారాలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికాలో బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ పరిధి, రాజ్యాంగపరమైన హక్కులపై మరోసారి న్యాయ, రాజకీయ చర్చలు వేడెక్కే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!