

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి రాష్ట్రంలోని చేనేత కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత ప్రతీక అని పేర్కొంటూ, చేనేత వస్త్రాలను ధరించి నేతన్నల శ్రమను గౌరవించాలని పిలుపునిచ్చారు. నేతన్నల సృజనాత్మకత, కళా నైపుణ్యం దేశ గర్వకారణమని ఆమె అన్నారు.
గత 12 ఏళ్లుగా రాష్ట్రంలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని షర్మిల విమర్శించారు. జీఎస్టీ భారం, ప్రోత్సాహక పథకాల అమలులో వైఫల్యం కారణంగా నేతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, సహకార సంఘాల రుణాలను మాఫీ చేయాలని, బకాయి సబ్సిడీలను విడుదల చేయాలని, హ్యాండ్‌లూమ్ బోర్డును పునరుద్ధరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!