

నటుడు విశాల్ రాజకీయ నాయకులు బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై చేసిన వ్యాఖ్యలు, అనంతరం జరిగిన అరెస్ట్‌పై స్పందిస్తూ, తన తాజా చిత్రం ‘మగుడం’ (తెలుగులో ‘మకుటం’) ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ వాక్ స్వాతంత్య్రం ఉన్నప్పటికీ, రాజకీయ ప్రసంగాల్లో మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.
ఉదయనిధి తన కాలేజీ బ్యాచ్‌మేట్ కాగా, విజయ్ తన సీనియర్ అని గుర్తుచేసిన విశాల్, ఉదయనిధి ఒకరోజు అరెస్ట్ అవుతారని ఎప్పుడూ ఊహించలేదన్నారు. విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారని, ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో భాగమేనని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, విశాల్ కూడా రాజకీయాల్లోకి రావొచ్చనే ప్రచారం కొనసాగుతోంది. ప్రజా సేవ కోసం తనకు వచ్చిన గుర్తింపును వినియోగించాలని ఇటీవల ఆయన చేసిన వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!