

కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో రూ.10,000 కోట్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. హైదరాబాద్‌లో జరిగిన “రెనర్జైన్-2026” సదస్సులో ఆయన మాట్లాడుతూ, ఇంధన రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహంతో ముందుకు సాగుతోందని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని క్లీన్ ఎనర్జీ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
ప్రపంచ ఇంధన భద్రత ప్రస్తుతం భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా సవాళ్లను ఎదుర్కొంటోందని ఆయన అన్నారు. ఈ పరిస్థితులను దాదాపు 12 ఏళ్ల క్రితమే ఊహించిన ప్రధాని నరేంద్ర మోదీ క్లీన్ ఎనర్జీ విప్లవానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. పునరుత్పాదక ఇంధనం ఇప్పుడు ప్రభుత్వ విధానమే కాకుండా ప్రజా ఉద్యమంగా మారిందని, పర్యావరణాన్ని కాపాడుతూ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!