
ఆరోగ్యం

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సౌదీ అరేబియా రాజధాని రియాద్‌కు ఫ్లైఏడీల్ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన తొలి విమానానికి ఎయిర్‌పోర్ట్ సీఈవో కదీర్ కదిరవన్, ఎయిర్‌పోర్ట్ ఆపరేషన్స్ హెడ్ అబ్దుల్ రహమాన్ అల్ రషీద్, జీఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విమానానికి జెండా ఊపి ప్రారంభించారు.
ఎయిర్‌పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ విమానం ప్రతిరోజూ ఉదయం 7.55 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి సుమారు 5 గంటల 40 నిమిషాల ప్రయాణం తర్వాత రియాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రాత్రి 11.20 గంటలకు రియాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. ఈ కొత్త సర్వీస్ వల్ల భారత్–సౌదీ మధ్య ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!