

ఆరోగ్య రంగంలో జరుగుతున్న వేగవంతమైన మార్పులను అవకాశాలుగా మార్చుకుంటూ తెలంగాణను ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సిద్ధిపేట జిల్లా మర్కూక్ మండలం కరకపట్ల గ్రామంలో రూ.800 కోట్ల పెట్టుబడితో సాయి లైఫ్ సైన్సెస్ ఏర్పాటు చేసిన తొలి ఆంకాలజీ తయారీ కేంద్రం బయోటెక్ పార్క్ ఫేజ్–3ను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డితో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామిక ప్రగతిలో దేశానికి ఆదర్శంగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ ప్లాంటులో కేన్సర్ నివారణకు సంబంధించిన ఓరల్ ఔషధాలు, స్టెరిలైజ్డ్ ద్రవాలు, పౌడర్లు, సాఫ్ట్ జెల్ క్యాప్సూల్స్ తయారు చేస్తారని వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 500 మందికి ఉపాధి లభించనుంది. జహీరాబాద్‌లోని నిమ్జ్‌ను మాన్యుఫ్యాక్చరింగ్ జోన్‌గా అభివృద్ధి చేసే ప్రణాళికలు రూపొందించామని, ప్రాణాంతక వ్యాధులకు చికిత్స అందించే కొత్త మాలిక్యూల్ తెలంగాణ నుంచే రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!