
ఆరోగ్యం

హైదరాబాద్ పెట్టుబడులకు ప్రముఖ గమ్యస్థానంగా ఎదుగుతోందని, తెలంగాణ పారిశ్రామిక మరియు సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మంగళ, బుధవారాల్లో జరగనున్న గ్రీన్ గ్రోత్ ఎనర్జీ సమిట్–2026 నేపథ్యంలో సోమవారం రాత్రి హైటెక్స్ నోవాటెల్‌లో విదేశీ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొన్నారు.
హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చెందుతోందని, ఇక్కడ పెట్టుబడులు పెట్టే సంస్థలకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు రిత్విక భట్టాచార్య, ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!