

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేశారు. ప్రధాన న్యాయమూర్తితో కలిపి మొత్తం 38 మంది న్యాయమూర్తులు ఉండేలా ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఇప్పటికే ఆమోదం లభించింది.
కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం సుప్రీంకోర్టులో 92 వేలకుపైగా కేసులు పెండింగ్‌లో ఉండటంతో ప్రజలకు వేగంగా న్యాయసేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజేఐతో కలిపి 32 మంది న్యాయమూర్తులు సేవలందిస్తుండగా, రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఏడాది నవంబర్‌లోపు నలుగురు న్యాయమూర్తులు పదవీ విరమణ చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!