

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఏర్పడిన ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా ఎదుర్కొందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ప్రభుత్వ విధానాలు, ఇంధన దిగుమతుల్లో వైవిధ్యం, బలమైన ద్వైపాక్షిక సంబంధాల కారణంగా దేశం తక్కువ భారంతో బయటపడిందని చెప్పారు. రాజస్థాన్ బలోత్రా జిల్లా పచ్‌పద్రాలో దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ-పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, సంక్షోభానికి ముందు భారత్ 25–26 దేశాల నుంచి ఇంధనం దిగుమతి చేసుకోగా, ఇప్పుడు ఆ సంఖ్య 40కి పైగా దేశాలకు పెరిగిందన్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరల పెరుగుదల వల్ల ప్రభుత్వానికి భారీ నష్టం వచ్చినప్పటికీ, ఆ భారాన్ని ప్రభుత్వమే భరించిందని చెప్పారు. ప్రజలపై భారం పడకుండా ఎక్సైజ్ సుంకం తగ్గించామని తెలిపారు. భారత్‌ను కొందరు తప్పుగా అంచనా వేశారని, కానీ దేశం బలంగా ఎదిగిందని ఆయన అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!