
జనరల్

హనుమకొండ జిల్లా దామెర మండలం పులకుర్తి గ్రామం సమీపంలో దేవాదుల పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. లీకేజీ కారణంగా చుట్టుపక్కల వందల ఎకరాల్లో విత్తనాలు వేసిన వ్యవసాయ భూములు పూర్తిగా నీటిమయంగా మారాయి. భూమి కోతకు గురవడంతో పంటలు దెబ్బతిన్నాయి. భారీగా ఖర్చు చేసి విత్తనాలు వేసిన రైతులు ఇప్పుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శుక్రవారం రాత్రి నుంచి దేవాదుల గేట్ వాల్వ్ వద్ద లీకేజీ కొనసాగుతున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వృథాగా నీరు పారిపోతుండగా తక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని తెలిపారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి లీకేజీని అరికట్టడంతో పాటు రైతులకు తగిన నష్టపరిహారం అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!