
సినిమాలు

తెలంగాణ రైతుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఫెర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాతో పాటు డీఏపీ, ఇతర కాంప్లెక్స్ ఎరువులను బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసి, రైతులకు అవసరమైన ఎరువులను సకాలంలో అందించడమే ఈ యాప్ ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
ఈ యాప్‌ను వినియోగించేందుకు రైతులు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్రతి రైతుకు ప్రత్యేక ఐడీ కేటాయించనున్నారు. రైతు భరోసా, ఇతర రైతు సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందేందుకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని అధికారులు వెల్లడించారు. రైతులు సకాలంలో నమోదు చేసుకుని, యాప్ ద్వారా అందుబాటులో ఉన్న సేవలను వినియోగించుకోవాలని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!