

నెట్‌ఫ్లిక్స్ తాజా హిందీ డైరెక్ట్-టు-డిజిటల్ చిత్రం ‘గాంధారి’ నేటి నుంచి స్ట్రీమింగ్‌కు రానుంది. సెప్టెంబర్ 3, 2026న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తోంది. తాప్సీ పన్ను, ఇష్వాక్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు దేవాశిష్ మఖీజా దర్శకత్వం వహించగా, కనికా ధిల్లాన్ రచన అందించారు. సాధారణంగా అర్ధరాత్రి స్ట్రీమింగ్ అవుతుందని భావించినప్పటికీ.. ఈసారి మధ్యాహ్నం 12:30 గంటలకు సినిమా స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది.
‘గాంధారి’ కథ బాని అనే తల్లి చుట్టూ సాగుతుంది. ఓ దారుణమైన దాడి తర్వాత బాని తాత్కాలికంగా చూపును కోల్పోతుంది. అదే సమయంలో ఆమె చిన్న కుమార్తెను కొందరు కిడ్నాప్ చేస్తారు. కూతురిని ఎలాగైనా తిరిగి తీసుకురావాలనే పట్టుదలతో బాని తనను తాను శిక్షణ పొందించి, ప్రమాదకరమైన మానవ అక్రమ రవాణా ముఠాపై పోరాటానికి సిద్ధమవుతుంది. ఛాయా కదమ్, స్వస్తికా ముఖర్జీ, మితా వశిష్ఠ్, జతిన్ సర్నా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్, భావోద్వేగాలతో కూడిన ఈ థ్రిల్లర్ నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!