
జనరల్

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఆయన ఇవాళ, రేపు ఛత్తీస్‌గఢ్‌లో అధికారిక పర్యటన చేయాల్సి ఉంది. అయితే దేశవ్యాప్తంగా జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ పర్యటనను వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో ఆయన అధికారిక పర్యటనలపై ఆసక్తి నెలకొంది.
ఎన్నికల సంఘం పనితీరు, ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై ప్రతిపక్ష పార్టీలు, వివిధ వర్గాలు విమర్శలు చేస్తూ నిరసనలు చేపడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సీఈసీ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా పడటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పర్యటనకు కొత్త తేదీలను ఇంకా వెల్లడించాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!