
రాజకీయాలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. ఈ సీజన్లో తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే దిగువకు పడిపోయాయి. దీంతో రాష్ట్రంలో చలి ప్రభావం పెరుగుతోంది.
సంగారెడ్డి జిల్లాలోని సత్వార్‌లో అత్యల్పంగా 9.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కోహీర్‌లో 9.7 డిగ్రీలు, న్యాల్కల్, ఝరాసంగంలో 10 డిగ్రీలు నమోదయ్యాయి. కామారెడ్డి జిల్లా డోంగ్లిలో 10.5 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా బషీరాబాద్, ధారూర్‌లో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!