
రాజకీయాలు

కేరళంలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో క్యూలైన్లలో రద్దీ పెరిగింది. దీంతో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి భక్తులు దాదాపు 10 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోంది.
భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు ఎక్కువ మందికి దర్శన అవకాశం కల్పించేందుకు అధికారులు అదనంగా 5 వేల క్యూ స్లాట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు ఆన్‌లైన్ వర్చువల్ క్యూ బుకింగ్ తప్పనిసరి చేశారు. భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో స్లాట్ బుక్ చేసుకుని, అందుకు అనుగుణంగా తమ యాత్రను ప్లాన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!