
జనరల్

మేడ్చల్ జిల్లా నాగారంలో ప్రముఖ నటుడు సుప్రీత్ రెడ్డి తనపై దాడికి పాల్పడ్డారని ఓ క్యాబ్ డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బుకింగ్ కోసం రోడ్డుపక్కన వేచి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. వాహనం నిలిపిన విషయంలో వివాదం తలెత్తినట్లు సమాచారం.
కారుకు అడ్డుగా ఉన్నానంటూ సుప్రీత్ రెడ్డి తనను దుర్భాషలాడి, అనంతరం చితకబాదారని క్యాబ్ డ్రైవర్ ఆరోపించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!