

సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వం తమిళనాడు రాజకీయాల్లో అత్యంత యువ నాయకత్వంతో ఏర్పడిన ప్రభుత్వాల్లో ఒకటిగా చర్చనీయాంశమవుతోంది. సమాచారం ప్రకారం టీవీకేకు చెందిన 93 మంది ఎమ్మెల్యేలు తొలిసారి శాసనసభకు ఎన్నిక కాగా, 41 మంది ఎమ్మెల్యేలు 40 ఏళ్లలోపు వయస్సు కలిగిన వారే. యువతకు, కొత్త నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న విజయ్ వ్యూహం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించిందని విశ్లేషకులు చెబుతున్నారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే 108 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో డీఎంకే, అన్నాడీఎంకే ఆధిపత్యానికి ముగింపు పలికినట్టైంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో వ్యాపారం, న్యాయవాదం, వైద్యం, మీడియా, నిర్మాణ రంగం, సామాజిక సేవల నుంచి వచ్చిన వారు అధికంగా ఉన్నారు. విజయ్ అభిమాన సంఘాలు, ప్రజా కార్యక్రమాల్లో పనిచేసిన వారికి కూడా అవకాశం కల్పించినట్టు సమాచారం. తమిళనాడు రాజకీయాల్లో ఇది పెద్ద తరం మార్పుగా రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!