
సినిమాలు

ఒక కీలక తీర్పులో బాంబే హైకోర్టు విడాకులు పొందిన భార్యకు భర్త మరణించిన తర్వాత కూడా అతని ఆస్తి నుంచి భరణం పొందే హక్కు ఉందని స్పష్టం చేసింది. అయితే జీవన వ్యయాలు, వైద్య ఖర్చులు పెరిగాయని చెప్పి భరణం మొత్తాన్ని పెంచాలని కోరలేరని తెలిపింది. జస్టిస్ భారతి డాంగ్రే మరియు జస్టిస్ మంజూషా దేశ్‌పాండే ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది.
2012లో భర్త నరేన్ గోరెగావోంకర్ మరణంతో భరణం నిలిచిపోవడంతో 62 ఏళ్ల మహిళ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పెండింగ్ భరణం చెల్లించాలని వారసులకు ఆదేశించినప్పటికీ, భరణం పెంపుపై అభ్యర్థనను తిరస్కరించారు. హైకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని సమర్థిస్తూ వారసులు స్వయంగా సంపాదించిన ఆస్తులను భరణం పెంపుకు పరిగణించలేమని తీర్పు ఇచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!