

నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి కావడంపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించిన నిమ్స్ డైరెక్టర్ డా. రాహుల్ దేవరాజ్‌తో పాటు వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఆపరేషన్ థియేటర్ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు.
నిమ్స్‌లో నిర్వహించిన రోబోటిక్ సర్జరీల్లో 90 శాతానికి పైగా ఆరోగ్యశ్రీ, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఉచితంగా నిర్వహించడం ప్రశంసనీయమని సీఎం అన్నారు. ఇటీవలే 2,000 కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల మైలురాయిని చేరుకున్న నిమ్స్, ఇప్పుడు 1,000 రోబోటిక్ సర్జరీల ఘనతను కూడా సాధించడం గర్వకారణమని పేర్కొంటూ, వైద్యరంగంలో సంస్థ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!