
క్రీడలు

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో రేపు జరిగే ప్రధాని నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయడానికి బీజేపీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు రెండు లక్షల మంది ప్రజలు, పార్టీ కార్యకర్తలను సమీకరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాల వారీగా ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ ఆధ్వర్యంలో ఏర్పాట్లను నిత్యం పర్యవేక్షిస్తున్నారు. సభకు భారీ జనసమీకరణ కోసం పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం, రవాణా ఏర్పాట్లు చేపట్టినట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!