
జనరల్

అనంతపురం జిల్లాలో బర్డ్‌ఫ్లూ కలకలం రేపుతోంది. సిద్దరాంపురం గ్రామంలో సుమారు 2 వేల కోళ్లు మృత్యువాత పడటంతో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కోళ్ల నుంచి సేకరించిన నమూనాలను పరీక్షల కోసం భోపాల్‌లోని ల్యాబ్‌కు పంపించారు. బర్డ్‌ఫ్లూ పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపట్టారు.
బర్డ్‌ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొంతకాలం చికెన్‌కు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ అవగాహన ర్యాలీలు చేపడుతున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!