

రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక శుభవార్త అందించింది. ‘ఒకే దేశం – ఒకే రేషన్ కార్డు’ (ONORC) పథకం కింద కొత్త మార్పులను అమలు చేస్తూ దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా, ఏ ఫెయిర్ ప్రైస్ షాప్ నుంచైనా రేషన్ పొందే అవకాశం కల్పించింది. దీంతో ఒకే రేషన్ దుకాణంపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులు తమకు అనుకూలమైన ప్రాంతంలోనే బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలను పొందగలుగుతారు.
ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన, జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) కింద లబ్ధి పొందుతున్న కోట్లాది మందికి ఈ నిర్ణయం ఉపయోగపడనుంది. ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ధృవీకరణతో దేశంలోని ఏ రేషన్ దుకాణం నుంచైనా ధాన్యాన్ని తీసుకునే వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా వలస కార్మికులు, ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న కుటుంబాలకు ఇది పెద్ద ఊరటనివ్వనుంది. ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడమే ఈ నిర్ణయ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!