

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఆగస్టు 13, 2026 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొ. అమరేశ్వర్ నేతృత్వంలో, లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల సహకారంతో శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. గత ఐదేళ్లుగా నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వైద్య అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తూ వాక్-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలిస్తారు. అవసరమైన వైద్య పరీక్షలు పూర్తిచేసిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న అర్హులైన చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. తల్లిదండ్రులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య పంజాగుట్టలోని నిమ్స్ పాత బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న సీటీ సర్జరీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదు. అందుబాటులో ఉంటే పాత వైద్య నివేదికలు, పరీక్షల వివరాలను తీసుకురావాలి. సమాచారం కోసం 040-2348-9025కు ఫోన్ చేయవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!