
సినిమాలు

రొయ్యల్లో ‘వైట్ గట్’ వ్యాధి లక్షణాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. మత్స్యశాఖ అధికారులను అప్రమత్తం చేస్తూ, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సూచించారు.
ఇక ఉండి మండలం మహదేవిపట్నం ప్రాంతంలోని చెరువును అధికారులు పరిశీలించారు. రైతు చెరువులో రొయ్యలు, ఫీడ్, నీటి నమూనాలను సేకరించి కైకలూరు, భీమవరం ల్యాబ్‌లకు పంపించారు. తాజా ఎస్‌వోపీ ప్రకారం రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని భరోసా ఇచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!