
బిజినెస్

తమ ప్లాంట్‌లోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి మూడు రోజులుగా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ భారతి సిమెంట్స్ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. కంపెనీ డైరెక్టర్ బాలాజీ దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ అంతరాయాల కారణంగా సున్నపురాయి తవ్వకాలు ప్రభావితమయ్యాయని, ఉత్పత్తి నిలిచిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కలెక్టర్, ఎస్‌పీకి ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన రాలేదని కంపెనీ ఆరోపించింది. కార్యకలాపాలు కొనసాగకపోతే వేలాది మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ పరిస్థితుల్లో జోక్యం చేసుకుని ప్లాంట్ కార్యకలాపాలు సజావుగా సాగేలా పోలీసులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును భారతి సిమెంట్స్ కోరింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!