
జనరల్

హైదరాబాద్‌కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చిన చార్మినార్ నుంచి మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. మొదటి అంతస్తులో మరమ్మతులు జరుగుతున్న పువ్వుల ఆకారపు భాగాలు కిందపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన రాత్రి సమయంలో చోటుచేసుకోవడంతో ఆ సమయంలో పర్యాటకులు ఎవరూ అక్కడ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దీంతో చార్మినార్ నిర్వహణ, భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.
గతంలోనూ చార్మినార్ మక్కా మసీదు వైపు, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వైపు పెచ్చులు ఊడిపడిన ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు, పర్యాటకులు గుర్తుచేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి నిత్యం పర్యాటకులు సందర్శించే చార్మినార్ విషయంలో నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని వారు అంటున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మరమ్మతులు, భద్రతా చర్యలను పకడ్బందీగా చేపట్టాలని కోరుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!