
సినిమాలు

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న కొత్త ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు సమాచారం. దీంతో ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రారంభించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 20న పూజా కార్యక్రమాలతో సినిమాను ఘనంగా లాంచ్ చేయాలని చిత్రబృందం భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
పూజా కార్యక్రమాల అనంతరం డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించేలా మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 2027 చివరి నాటికి షూటింగ్‌ను పూర్తి చేయాలని యూనిట్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. గతంలో రామ్ చరణ్, సుకుమార్ కలయికలో వచ్చిన ‘రంగస్థలం’ విజయంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!