

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 36 గంటల పాటు అంతరాయం కలిగించిన మైక్రోసాఫ్ట్ సేవలు ఎట్టకేలకు పునరుద్ధరించబడ్డాయి. ఔట్‌లుక్, టీమ్స్, మైక్రోసాఫ్ట్ 365, కోపైలట్ సహా ప్రభావిత సేవలన్నీ తిరిగి అందుబాటులోకి వచ్చినట్లు సంస్థ వెల్లడించింది. సాంకేతిక సమస్యను పూర్తిగా పరిష్కరించామని, వినియోగదారులు ఇకపై ఈ-మెయిల్స్‌తో పాటు ఇతర సేవలను యథావిధిగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ అంతరాయం 70కి పైగా దేశాల్లో వినియోగదారులపై ప్రభావం చూపడంతో మైక్రోసాఫ్ట్ క్షమాపణలు చెప్పింది. సమస్యకు గల కారణాలను వివరిస్తూ సమగ్ర నివేదిక విడుదల చేస్తామని ప్రకటించింది.
మైక్రోసాఫ్ట్ సేవల్లో గురువారం రాత్రి నుంచి అంతరాయం ఏర్పడటంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ మౌలిక సదుపాయాలపై ఆధారపడిన కొన్ని థర్డ్ పార్టీ సేవలపైనా దీని ప్రభావం పడింది. ఓపెన్‌ఏఐ, ఆంథ్రోపిక్ ఏఐ సేవల్లోనూ అంతరాయాలు నమోదయ్యాయి. భారత్‌లో ఇండిగో, ఎయిరిండియా, ఆకాశ ఎయిర్ వంటి విమానయాన సంస్థల ఈ-మెయిల్ ఆధారిత కస్టమర్ సేవలకు ఆటంకం ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో విమాన కార్యకలాపాలపైనా ప్రభావం పడినట్లు, కొన్ని విమానాలు రద్దైనట్లు సమాచారం.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!