
జనరల్

బండి సంజయ్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 10న హైదరాబాద్లో నిర్వహించనున్న బహిరంగ సభను కనీవినీ ఎరగని రీతిలో విజయవంతం చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సిరిసిల్లలో జరిగిన సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేయాలని కోరారు. సభకు సంబంధించిన ప్రచారాన్ని మీడియా, సోషల్ మీడియా, వాల్ రైటింగ్ ద్వారా విస్తృతంగా నిర్వహించాలని సూచించారు.
ఇక హనుమాన్ జయంతి సందర్భంగా ఈ నెల 12న కరీంనగర్లో నిర్వహించనున్న ‘హిందూ ఏక్తా యాత్ర’ను కూడా విజయవంతం చేయాలని బండి సంజయ్ కోరారు. రాజకీయాలకు అతీతంగా జరిగే ఈ యాత్రకు జిల్లా వ్యాప్తంగా హిందువులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!