

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తిరుమలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. వీకెండ్ కావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగింది. వైకుంఠంలోని అన్ని క్యూ కంపార్ట్‌మెంట్లు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. బయట కూడా ఆక్టోపస్ సర్కిల్ వరకు క్యూలైన్లు కొనసాగుతున్నాయి. మరోవైపు అలిపిరి టోల్‌గేట్ వద్ద వాహనాలు భారీగా బారులు తీరాయి. ఉచిత సర్వదర్శనానికి సుమారు 24 గంటలు, ఎస్‌ఎస్‌డీ టోకెన్ భక్తులకు 9 గంటలు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 7 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం.
శనివారం తిరుమల శ్రీవారిని 90,293 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. అత్యధికంగా 53,090 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. హుండీ ద్వారా రూ.3.81 కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అలాగే భక్తులు 4.60 లక్షల తిరుమల లడ్డూలను కొనుగోలు చేశారు. సుమారు 3 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాలను స్వీకరించినట్లు టీటీడీ తెలిపింది. వీకెండ్ రద్దీ నేపథ్యంలో భక్తుల దర్శనం, వాహనాల రాకపోకలను సజావుగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!