

కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన కె.వి. అతుల్య ప్రతిష్టాత్మకమైన క్లాస్-2 ఎయిర్ కమర్షియల్ డైవింగ్ లైసెన్స్‌ను సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. వినోదాత్మక స్కూబా డైవింగ్‌కు భిన్నంగా, కమర్షియల్ డైవింగ్‌లో సముద్ర గర్భంలో చమురు, గ్యాస్ పైప్‌లైన్ల మరమ్మతులు, ఇంటర్నెట్ కేబుళ్ల నిర్వహణ, అండర్‌వాటర్ వెల్డింగ్ వంటి అత్యంత ప్రమాదకరమైన పనులు చేయాల్సి ఉంటుంది. ఆమె సాధించిన ఈ లైసెన్స్ ప్రపంచంలోని 130కి పైగా దేశాల్లో చెల్లుబాటు అవుతుంది.
కాలేజీ రోజుల్లో స్కూబా డైవింగ్ గురించి తెలుసుకున్న అతుల్య, ఎన్నో ఆర్థిక, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటూ తన లక్ష్యాన్ని సాధించారు. కేరళలో తొలి మహిళా స్కూబా డైవర్‌గా గుర్తింపు పొందిన ఆమె, తరువాత డైవింగ్ ఇన్‌స్ట్రక్టర్‌గా సేవలందించారు. కోస్టల్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. అనంతరం దక్షిణాఫ్రికాలో అధునాతన కమర్షియల్ డైవింగ్ శిక్షణ పూర్తి చేసి ఈ అరుదైన అంతర్జాతీయ లైసెన్స్‌ను అందుకొని భారతీయ మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!