
సినిమాలు

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం టొలీడో ప్రావిన్స్‌లో రెండు హైస్పీడు రైళ్లు ఢీకొన్న ఘటనలో 39 మంది మృతి చెందినట్లు సమాచారం. ఓ రైలు పట్టాలు తప్పి, మరో రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక వివరాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఘటనతో రైల్వే మార్గంలో తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. రైళ్లలో ప్రయాణిస్తున్న వారికి జరిగిన గాయాలు, ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. మృతుల సంఖ్య, ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై అధికారిక సమాచారం ఆధారంగా మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!