28, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తుఫాన్ సహాయక చర్యలపై పవన్ కీలక ఆదేశాలు..

Writer: Harika S 03:41 PM, 28 అక్టోబర్, 2026
తుఫాన్ సహాయక చర్యలపై పవన్ కీలక ఆదేశాలు..

అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక, పునరుద్ధరణ చర్యలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం వివిధ జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావం పూర్తిగా తగ్గే వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండాలని, ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది పరిసరాలు, కాకినాడ తీర ప్రాంతాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఉప్పాడ తీర రహదారికి జరిగిన నష్టం, ఇళ్ల పరిస్థితి, ఏలేరు ముంపు ప్రాంతాలపై ప్రత్యేకంగా సమీక్షించారు. బలమైన గాలుల కారణంగా చెట్లు నేలకొరగడం, రహదారులు దెబ్బతినడం, విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో పలు ప్రాంతాల్లో సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోనే 93 రహదారులు దెబ్బతినగా, సుమారు 736 చెట్లు నేలకొరిగినట్లు వివరించారు. రహదారులపై అడ్డంకులను త్వరగా తొలగించాలని, వాగులు, వంకలు, చెరువుల నీటిమట్టాలను నిరంతరం పర్యవేక్షించాలని ఉప ముఖ్యమంత్రి సూచించారు.

సమీక్షలో వెల్లడించిన ప్రాథమిక అంచనాల ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాలపై తుఫాన్ తీవ్ర ప్రభావం చూపగా, 28,000 మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. సుమారు 70,000 హెక్టార్లలో పంటలు నీట మునిగినట్లు, మరో 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. ఇళ్లు, రహదారులు, విద్యుత్ వ్యవస్థలకు కూడా నష్టం వాటిల్లింది. సహాయక చర్యల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, 11 ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు వివిధ శాఖలకు చెందిన సుమారు 32,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. పునరావాస కేంద్రాల్లో ఆహారం, తాగునీరు, వైద్య సేవలు, పారిశుధ్యానికి ఇబ్బందులు లేకుండా చూడాలని, దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ సరఫరా, తాగునీటి వ్యవస్థలను త్వరగా పునరుద్ధరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. నిల్వ నీటిలో క్లోరినేషన్, బ్లీచింగ్ ద్వారా అంటువ్యాధులు వ్యాపించకుండా చర్యలు తీసుకోవాలని, పంటలు, ఇళ్లు, ఆస్తుల నష్టాన్ని పారదర్శకంగా అంచనా వేసి పరిహారం కోసం నివేదికలు పంపాలని సూచించారు. ప్రజలు అధికారుల సూచనలు పాటించాలని, వాతావరణ శాఖ అనుమతి ఇచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ పర్యటనకు బ్రేక్.. కంబోడియా పోర్టులో నిలిచిపోయిన విలాస నౌక

ప్రపంచ పర్యటనకు బ్రేక్.. కంబోడియా పోర్టులో నిలిచిపోయిన విలాస నౌక

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబాటు

బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఏసీబీ సోదాలు..లంచం తీసుకుంటూ ఎస్సై పట్టుబాటు

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం

స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం

కోచింగ్‌ ఫీజులు, హాస్టల్‌ ఖర్చుల కోసం రక్తం అమ్ముకుంటున్న విద్యార్థులు?

కోచింగ్‌ ఫీజులు, హాస్టల్‌ ఖర్చుల కోసం రక్తం అమ్ముకుంటున్న విద్యార్థులు?

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నిక బరిలో హర్దీప్ సింగ్ పురి
ట్యాగ్లు
పవన్ కళ్యాణ్అర్నబ్ తుఫాన్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతుఫాన్ సహాయక చర్యలువిపత్తు నిర్వహణపంట నష్టంకాకినాడకోనసీమఎన్డీఆర్‌ఎఫ్ఎస్‌డీఆర్‌ఎఫ్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఉప ఎన్నిక బరిలో హర్దీప్ సింగ్ పురి

డిజిటల్‌ అరెస్టు అంటే డిజిటల్‌ దోపిడీనే.. సైబర్‌ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు

డిజిటల్‌ అరెస్టు అంటే డిజిటల్‌ దోపిడీనే.. సైబర్‌ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలి: సుప్రీంకోర్టు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?
గాసిప్స్

నాని ‘బ్లడీ రోమియో’లోకి ‘ధురంధర్’ నటుడు వివేక్ సిన్హా ఎంట్రీ ?

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..
గాసిప్స్

క్లైమాక్స్‌కు చేరుకున్న రాజమౌళి ‘వారణాసి’ షూటింగ్..

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార
సినిమాలు

‘మూకుత్తి అమ్మన్ 2’పై ఎమోషనల్ నోట్ షేర్ చేసిన నయనతార

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మకు అగ్రస్థానం..
క్రీడలు

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అభిషేక్‌ శర్మకు అగ్రస్థానం..

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన
జనరల్

విద్యాసంస్థల్లో డ్రగ్స్‌పై అవగాహన ప్రతిజ్ఞ చేయించాలి.. గవర్నర్ కీలక సూచన

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ
సినిమాలు

వెంకటేశ్, త్రివిక్రమ్‌ల ఆదర్శ కుటుంబం బుకింగ్స్ షురూ

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం
జనరల్

కేంద్ర కేబినెట్ గుడ్ న్యూస్.. ఉద్యోగులు, పెన్షనర్లకు కీలక నిర్ణయం

భారత్‌లో పెట్టుబడులకు ముందుకు రండి.. డచ్‌ పారిశ్రామికవేత్తలకు పీయూష్‌ గోయల్‌ పిలుపు
బిజినెస్

భారత్‌లో పెట్టుబడులకు ముందుకు రండి.. డచ్‌ పారిశ్రామికవేత్తలకు పీయూష్‌ గోయల్‌ పిలుపు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త షెడ్యూల్
జనరల్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కొత్త షెడ్యూల్

మూడోసారి తల్లిదండ్రులు కాబోతున్నారా? అనుష్క శర్మపై మరోసారి ప్రెగ్నెన్సీ రూమర్స్‌!