

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అక్వాన్’ తీవ్ర తుపాను తీరం దాటే ప్రక్రియ కొనసాగుతోందని వాతావరణశాఖ వెల్లడించింది. మరో మూడు గంటల్లో పూర్తిగా తీరం దాటే అవకాశముందని తెలిపింది. గత ఆరు గంటల్లో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలినట్లు పేర్కొంది. ఒడిశాలోని గోపాల్పూర్ సమీపంలో తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది.
తుపాను ప్రభావంతో నేడు శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఇప్పటికే ఇచ్ఛాపురంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటిల్లో 10 సెం.మీ, పలాసలో 9.9 సెం.మీ, సోంపేటలో 9.2 సెం.మీ, వజ్రపుకొత్తూరులో 4.9 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!