
రాజకీయాలు

అమెరికాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ (NWS) హెచ్చరించింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. కేవలం 30 నిమిషాల వ్యవధిలో గరిష్ఠంగా 2.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.
మాలిబు, బెవర్లీ హిల్స్, డౌన్‌టౌన్ లాస్ ఏంజెలెస్, శాన్ ఫెర్నాండో వ్యాలీ ప్రాంతాలకు వరద హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల అగ్నిప్రమాదాల ప్రభావానికి గురైన ఆల్టడీనా, ఈటన్ ప్రాంతాల్లోనూ వరద ముప్పు పొంచి ఉందని అప్రమత్తం చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!