

ప్రీమియం ఉత్పత్తులు అంటే కేవలం అధిక ధరలు కాదని, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అత్యుత్తమ అనుభవాన్ని అందించడమే అసలు లక్ష్యమని ఆసుస్ కన్స్యూమర్ బిజినెస్ యూనిట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షాన్ యెన్ తెలిపారు. తైపేలో జరిగిన కంప్యూటెక్స్ 2026 సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత మార్కెట్ ఆసుస్‌కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. విక్రయానంతర సేవలను మెరుగుపరచడం, ఇంటి వద్దే చిన్నపాటి మరమ్మతుల సదుపాయాలు కల్పించడం వంటి చర్యల ద్వారా వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు.
ఏఐ రంగంలో కూడా ఆసుస్ భారీగా పెట్టుబడులు పెడుతోంది. క్లౌడ్‌పై ఆధారపడకుండా, వినియోగదారుల గోప్యతను కాపాడే విధంగా ఆన్-డివైస్ ఏఐపై దృష్టి సారిస్తోంది. జెన్‌బుక్ ల్యాప్‌టాప్‌లలో ఉపయోగిస్తున్న ‘సెరాల్యూమినియం’ వంటి ప్రత్యేక పదార్థాలతో పాటు, ఆర్‌ఓజీ, జెన్‌బుక్, వివోబుక్, ప్రోఆర్ట్ వంటి ఉత్పత్తులను వేర్వేరు వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందిస్తున్నట్లు షాన్ యెన్ తెలిపారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత వ్యక్తిగత కంప్యూటింగ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!