

చాట్‌జీపీటీ యాప్ ఓపెన్‌ఏఐకు చెందినది, మే నెల నాటికి 1 బిలియన్ నెలవారీ యూజర్ల మార్క్‌ను దాటిందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ సెన్సార్ టవర్ వెల్లడించింది. కేవలం మూడు సంవత్సరాల్లోనే ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే తొలి ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ నిలిచింది. ఇదే మార్క్‌ను చేరడానికి టిక్‌టాక్‌కు ఐదు సంవత్సరాలు, ఇన్‌స్టాగ్రామ్‌కు దాదాపు ఎనిమిది సంవత్సరాలు పట్టింది. దీంతో చాట్‌జీపీటీ అత్యంత వేగంగా ఎదిగిన ఏఐ యాప్‌గా నిలిచింది.
2023లో చాట్‌జీపీటీని ఓపెన్‌ఏఐ సంస్థ ప్రారంభించింది. ప్రస్తుతం ఇది మార్కెట్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ ఆంథ్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ యాప్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటోంది. చాట్‌జీపీటీ వార్షికంగా 62 శాతం వృద్ధి సాధించగా, క్లాడ్ యాప్ 640 శాతం వృద్ధితో 56 మిలియన్ యాక్టివ్ యూజర్లను సాధించింది. ఈ రెండు సంస్థలు ఐపీఓకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఓపెన్‌ఏఐ ఇప్పటికే యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు పత్రాలు సమర్పించగా, ఆంథ్రోపిక్ కూడా రహస్యంగా దాఖలు చేసినట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!