

ఏఐ ఆధారిత వాయిస్ క్లోనింగ్ మోసాలను అడ్డుకునేందుకు గూగుల్ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ‘ఫేక్ కాల్ డిటెక్షన్’ అనే కొత్త భద్రతా ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా పరిచయస్తుల స్వరాన్ని ఏఐ సాయంతో అనుకరించి మోసగాళ్లు చేసే కాల్స్‌ను ఈ ఫీచర్ గుర్తించి హెచ్చరిస్తుంది. మొబైల్ పరిశ్రమలో ఇలాంటి సాంకేతికతను తీసుకొచ్చిన తొలి సంస్థగా గూగుల్ పేర్కొంది.
ఈ ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్టెడ్ RCS టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. కాల్ చేసిన వ్యక్తి నిజమైనవారేనని నిర్ధారించే సురక్షిత సంకేతాన్ని పంపిస్తుంది. ఒకవేళ సంప్రదింపు జాబితాలో ఉన్న వ్యక్తి పేరుతో కాల్ వచ్చినా ధృవీకరణ సంకేతం లేకపోతే, ఆ వ్యక్తి ఫోన్‌తో ఆండ్రాయిడ్ తనిఖీ చేస్తుంది. కాల్ నిజం కాదని తేలితే వినియోగదారునికి వెంటనే హెచ్చరిక అందుతుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ 12 మరియు అంతకంటే పై వెర్షన్లలో, మొదటగా పిక్సెల్ ఫోన్లలో అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!