

భారత ప్రజా రవాణా వ్యవస్థపై ఓ అమెరికన్ మహిళ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లిజ్ అనే అమెరికన్ కంటెంట్ క్రియేటర్ ‘ముంబై మెట్రో ఎక్స్‌పీరియన్స్’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో పోస్ట్ చేస్తూ ముంబై మెట్రో సౌకర్యాలను ప్రశంసించారు. కేవలం ₹20కే టికెట్ లభించడం, స్టేషన్ పరిశుభ్రత, ప్రయాణికుల భద్రత కోసం ఏర్పాటు చేసిన ప్లాట్‌ఫామ్ స్క్రీన్ డోర్లు తనను ఆశ్చర్యపరిచాయని ఆమె పేర్కొన్నారు.
మెట్రోలో ప్రయాణించిన తర్వాత మరింత ఆకట్టుకున్నట్లు లిజ్ తెలిపారు. న్యూయార్క్ సబ్‌వేతో పోలిస్తే ముంబై మెట్రో మరింత శుభ్రంగా, సౌకర్యవంతంగా ఉందని అభిప్రాయపడ్డారు. ముంబై వేడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థను ప్రశంసించడంతో పాటు మహిళల కోసం ప్రత్యేక కోచ్ ఉండటాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి సౌకర్యం తాను ఇతర దేశాల్లో చాలా అరుదుగా చూసానని వ్యాఖ్యానించారు.
ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. చాలామంది ఆమెకు ముంబైకి స్వాగతం పలుకుతుండగా, భారత మౌలిక సదుపాయాలపై సానుకూల అభిప్రాయాలు వెలుగులోకి రావడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. మరికొందరు ఢిల్లీ మెట్రోను కూడా అనుభవించాలని సూచించారు. మొత్తం మీద ఈ వీడియో భారత ప్రజా రవాణా వ్యవస్థ సామర్థ్యంపై సానుకూల చర్చకు దారితీసింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!