
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పాఠశాలల్లో హాజరు నమోదుకు కొత్తగా ఏఐ ఆధారిత సాంకేతికతను ప్రవేశపెట్టింది. మంగళగిరి, తాడేపల్లి, విజయవాడలో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ విధానం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. విద్యార్థుల ముఖాలను ఫేస్ రికగ్నిషన్ ద్వారా గుర్తించి, గ్రూప్ ఫోటో తీసిన వెంటనే ఆటోమేటిక్‌గా హాజరు నమోదు అవుతుంది.
ఈ విధానం వల్ల హాజరు ప్రక్రియలో సమయం ఆదా కావడంతో పాటు ఖచ్చితత్వం, పారదర్శకత పెరుగుతాయని అధికారులు తెలిపారు. పాఠశాల వ్యవస్థను మరింత డిజిటల్‌గా మార్చే దిశగా ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!